సినిమాల్లో మీ జోరు ఎందుకు త‌గ్గింద‌న్న‌ అలీ.. బ్ర‌హ్మానందం ఆగ్ర‌హం.. వీడియో ఇదిగో

30-11-2021 Tue 13:35
  • అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మానందం
  • ప్రోమో విడుద‌ల చేసిన‌ ఈటీవీ
  • బ్ర‌హ్మానందం త‌న క‌ళ్ల‌జోడును నేల‌పై ప‌డేసిన వైనం
Alitho Saradaga latest promo Brahmanandam
ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మానందం పాల్గొన్నారు. ఇందులో అనేక విష‌యాల‌ను అలీతో బ్ర‌హ్మానందం పంచుకున్నారు. అయితే, ఈ మ‌ధ్య కాలం సినిమాల్లో మీ జోరు ఎందుకు త‌గ్గింద‌ని బ్ర‌హ్మానందాన్ని అలీ అడిగారు. దీంతో బ్ర‌హ్మానందం త‌న క‌ళ్ల‌జోడును నేల‌పై ప‌డేసి నిల‌బ‌డ్డాడు.

ఆగ్ర‌హంతో అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుద‌ల చేసింది. కాగా, ఈ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మానందాన్ని అలీ అనేక ప్ర‌శ్న‌లు అడిగారు. ఇద్ద‌రూ స‌ర‌దాగా మాట్లాడుకున్న తీరు అల‌రిస్తోంది. ఇందులో ఎస్వీఆర్ ను అనుక‌రిస్తూ బ్ర‌హ్మానందం డైలాగులు కూడా చెప్పారు.