మ్యాగ‌జైన్ కోసం హీరోయిన్ స‌మంత దిగిన ఫొటోలు వైరల్

30-11-2021 Tue 13:21
  • ELLE India మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫొటోలో స‌మంత
  • ఆ మ్యాగ‌జైన్‌కు ఇంట‌ర్వ్యూ
  • జీవితానికి సంబంధించిన ప‌లు విష‌యాలు చెప్పిన సామ్ 
samanta shares a pic
'ఈ మ్యాగ‌జైన్‌లో నా తొలి క‌వ‌ర్ ఫొటో.. యాయ్..' అంటూ హ‌ర్షం వ్య‌క్తం చేసింది హీరోయిన్ స‌మంత‌. ELLE India మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫొటోలో స‌మంత క‌న‌ప‌డుతోంది. #ELLEDigitalCoverStar పేరిట ఆ సంస్థ కూడా స‌మంత‌కు చెందిన ఫొటోల‌ను పోస్ట్ చేసింది. 'ద‌క్షిణాదిలో 11 ఏళ్ల సినీ కెరీర్ త‌ర్వాత స‌మంత ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో ఎలా ప్ర‌యాణం మొద‌లు పెట్టిందో తెలుసుకోండి' అంటూ పేర్కొంది. స‌మంత రూత్‌ప్రభుకు హ‌లో చెప్పండి అంటూ ఆ మ్యాగ‌జైన్ శీర్షిక పెట్టింది.
                          
'ఏం మాయ చేశావే' సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన స‌మంత ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను మ్యాగ‌జైన్‌లో తెలుసుకోండ‌ని తెలిపింది. త‌న జీవితానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను ఆ మ్యాగ‌జైన్‌తో పంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ మ్యాగ‌జైన్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన  ఫొటోనే స‌మంత రీట్వీట్ చేసింది.