'ఒకే వేదిక‌పై అల్లు అర్జున్, ప్ర‌భాస్' వార్తల్లో నిజం లేదు: శ‌ర‌త్ చంద్ర

30-11-2021 Tue 12:57
  • బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న పుష్ప
  • డిసెంబ‌రు 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ప్ర‌భాస్ హాజ‌ర‌వుతార‌ని ప్ర‌చారం
  • ఆ వార్త‌లు అస‌త్య‌మ‌న్న గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శ‌ర‌త్ చంద్ర
prabhas wint attend pushpa event
బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న పుష్ప సినిమాకు సంబంధించి డిసెంబ‌రు 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో జరపనున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పటికే ప్ర‌భాస్‌ను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అధికారికంగా ప్రకటన రాక‌పోయిన‌ప్ప‌టికీ ఈ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌భాస్ న‌టిస్తోన్న రాధేశ్యామ్ సినిమా కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో యంగ్ రెబ‌ల్ స్టార్ పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైతే రాధేశ్యామ్ సినిమాకు కూడా ప్ర‌మోష‌న్ ద‌క్కుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే, ఈ ప్ర‌చారంపై గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్, చావు కబురు చల్లగా సినిమా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శ‌ర‌ద్ చంద్ర నాయుడు స్పందించారు. ఒకే వేదిక‌పై ప్ర‌భాస్, బ‌న్నీ క‌న‌ప‌డ‌నున్నారంటూ వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.