అందుకే బోయపాటి మాట్లాడటం లేదట!

30-11-2021 Tue 11:57
  • బోయపాటి తాజా చిత్రంగా 'అఖండ'
  • యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో నడిచే కథ
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్  
Akhanda movie update
టాలీవుడ్ లో యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే కథలను తెరకెక్కించే దర్శకులలో బోయపాటి శ్రీను పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. మాస్ యాక్షన్ తో కూడిన కథలకు మసాలా ఎంతవరకూ అద్దాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అఖండ' రెడీ అవుతోంది.

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను గురించి బోయపాటి తనదైన స్టైల్లో మాట్లాడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇప్పుడేం మాట్లాడను .. సినిమా రిలీజ్ తరువాత మాట్లాడతానని ఆయన చెబుతుండటం విశేషం. గతంలో 'వినయ విధేయ రామ' సినిమా విషయంలో ఆయన చెప్పినదొకటి .. జరిగింది ఒకటి కావడంతో ఆయన విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్నాడు. అందువల్లనే ఈ సారి ఆయన తన పరిధి దాటి మాట్లాడటం లేదని చెప్పుకుంటున్నారు.