'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్?

30-11-2021 Tue 10:13
  • 'పుష్ప' పై పెరుగుతున్న అంచనాలు
  • వచ్చేనెల 6వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 17వ తేదీన సినిమా విడుదల
Pushpa movie update
అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. గతంలో ఈ కాంబినేషన్లో హిట్లు ఉండటం వలన ఇప్పుడు ఇది అందరిలో ఆసక్తిని రేపుతోంది. అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చేనెల 6వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దేవిశ్రీ సాంగ్స్ పరంగా ఈ సినిమా ఒక రేంజ్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ట్రైలర్ తో ఆ రేంజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో జరపనున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆయనను ఆహ్వానించడం జరిగిపోయిందని అంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎటు వైపు నుంచి ప్రకటన లేదు. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించనుండగా, సమంత స్పెషల్ సాంగ్ మరింత ఆకర్షణగా నిలవనుంది.