Andhra Pradesh: వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పండుగలన్నీ ఆదివారమే!

  • 23 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
  • ఐచ్ఛిక సెలవుల్లో 9 ఆదివారమే
  • సెలవుల్లో మార్పులు ఉంటే పత్రికా ప్రకటన ద్వారా ముందే తెలియజేస్తామన్న ప్రభుత్వం
AP Govt release leaves list of 2022

2022కు సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 23 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించగా, 21 రోజులను ఐచ్ఛిక సెలవులుగా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఐచ్ఛిక సెలవుల్లో 9 ఆదివారం రోజే రావడం ఉద్యోగులకు నిరాశ కలిగించింది.  


కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, మిలాద్-ఉన్-నబీ, క్రిస్‌మస్‌ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్దశి, యాజ్‌–దహుం–షరీఫ్‌ వంటి ఐచ్ఛిక సెలవులు కూడా ఆదివారమే రావడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

తిథుల ప్రకారం నిర్వహించే హిందూ పండుగలతోపాటు అప్పటికప్పుడు నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహరం, మిలాద్-ఉన్-నబీ వంటి పండుగల్లో మార్పులు అవసరమైతే కనుక పత్రికా ప్రకటన ద్వారా ముందుగానే తెలియజేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

More Telugu News