Rajnath Singh: టీఎంసీ ఎంపీ భుజం తట్టిన రాజ్‌నాథ్ సింగ్.. వీడియో వైరల్

Rajnath Singh pats on TMC MP Sudip Bandyopadhyays shoulder
  • పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతుండగా ఘటన
  • వెనక నుంచి వచ్చి రెండు చేతులతో ఎంపీ భుజాలు తట్టిన రాజ్‌నాథ్
  • వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయిన సుదీప్
  • మాట్లాడుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భుజాలు తట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెనక నుంచి భుజాలు తట్టిన రాజ్‌నాథ్ ముందుకు రావడం, వెనకవైపు చూసిన బందోపాధ్యాయ ఆశ్చర్యపోవడం వీడియోలో కనిపిస్తోంది. నిన్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వద్ద సుదీప్ మీడియాతో మాట్లాడుతున్నారు. పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.

అదే సమయంలో అటువైపుగా వచ్చిన రాజ్‌నాథ్ సుదీప్ భుజాలపై తన రెండు చేతులతో తట్టారు. వెనక్కి తిరిగి చూసిన సుదీప్ ఎవరూ లేకపోవడంతో ముందుకు చూశారు. రాజ్‌నాథ్ కనిపించడంతో ఆ పని ఆయనే చేసి ఉంటారని భావించి చిరునవ్వులు చిందించారు. స్పందించిన రాజ్‌నాథ్ ‘మాట్లాడండి’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

Rajnath Singh
BJP
TMC
Sudip Bandyopadhyay

More Telugu News