హైదరాబాదులో ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు

29-11-2021 Mon 20:06
  • కరోనా బారినపడిన శివశంకర్ మాస్టర్
  • చికిత్స పొందుతూ మృతి
  • నేడు మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు
  • పాడె మోసిన యాంకర్ ఓంకార్ సోదరులు
Sivasankar Master last rites held at Mahaprasthanam
కరోనా బారినపడిన సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో చికిత్స పొందుతూ ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన అంత్యక్రియలు నేడు మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించారు. ఆట డ్యాన్స్ షో నుంచి శివశంకర్ మాస్టర్ తో ఎంతో అనుబంధం ఉన్న యాంకర్ ఓంకార్ పాడె మోశారు. ఓంకార్ సోదరుడు అశ్విన్ కూడా పాడె మోశారు.

శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో, చిన్న కుమారుడు అజయ్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పంచవటిలోని శివశంకర్ మాస్టర్ నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. భర్త భౌతికకాయం వద్ద శివశంకర్ మాస్టర్ అర్ధాంగి విలపించడం అందరినీ కలచివేసింది.