అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను: తమన్

29-11-2021 Mon 19:52
  • 'అరవింద సమేత'లో ఆ పాట ఇష్టం
  • ఎంతో కష్టమైన ట్యూన్ అది
  • పాడటం కూడా చాలా కష్టమే
  •  ఆ పాట చాలా నిరాశపరిచిందన్న తమన్
Thaman said about Aeavinda Sametha song
సాధారణంగా ఏ విషయంలోనైనా కొన్ని అంచనాలు పెంచుకోవడం జరుగుతుంది. ఆ అంచనాలను అందుకోలేక పోయినప్పుడు సహజంగానే బాధ కలుగుతుంది. 'అరవింద సమేత'  సినిమాలోని ఒక పాట విషయంలో తనకి అలాంటి అనుభవమే ఎదురైందని తాజా ఇంటార్వ్యులో తమన్ అన్నాడు.

'అరవింద సమేత' సినిమాలో 'యాడబోయినాడో' అనే ఒక పాట కోసం ఎంతో కసరత్తు చేశాను. వైజాగ్ నుంచి నికిత అనే అమ్మాయిని పిలిపించి ఆ పాటను పాడించాం. ఆ అమ్మాయి ఎంతో అద్భుతంగా పాడింది. నా కుటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటనను గుర్తుచేసుకుని, ఒక మూడ్ లోకి వెళ్లి చేసిన పాట అది.

ఆ పాట ట్యూన్ కానీ .. పాడటం గాని అంత తేలికైన విషయం కాదు. ఒక రేంజ్ లో ఆ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఆ సినిమాలో మిగతా పాటలకి వచ్చిన గుర్తింపు ఆ పాటకి రాలేదు. అప్పుడు మాత్రం నాకు ఎంతో బాధ కలిగింది. నేను మంచి అనుభూతిని పొంది చేసిన పాటల్లో నిరాశపరిచింది ఇదే" అని చెప్పుకొచ్చాడు.