ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ప్రకటించిన అధిష్ఠానం

29-11-2021 Mon 18:49
  • కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం కమిటీ 
  • సోము వీర్రాజు సహా 13 మంది సభ్యులతో కమిటీ
  • ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు కమిటీలో చోటు
  • కమిటీలో పురందేశ్వరి, సుజనా తదితరులకు స్థానం
AP BJP High Command announces Core Committee for AP BJP
రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ఓ ప్రకటన చేసింది. ఈ కోర్ కమిటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు.

ఈ కమిటీలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, ఎమ్మెల్సీ మాధవ్, మధుకర్, నిమ్మక జయరాజ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి సభ్యులు కాగా... సునీల్ దేవధర్, మురళీధర్, శివప్రకాశ్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని బీజేపీ హైకమాండ్ వెల్లడించింది.