రాకెట్ లా దూసుకుపోతున్న నాటు పాట!

29-11-2021 Mon 18:39
  • రిలీజ్ కి రెడీగా 'ఆర్ ఆర్ ఆర్'
  • నాటు పాటకి తగ్గని క్రేజ్
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • కొరియోగ్రఫీకి మంచి మార్కులు
RRR movie update
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, జనవరి 7వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన 'నాటు నాటు' పాటను ఇటీవల రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకి, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. యూ ట్యూబ్ లో వదిలిన దగ్గర నుంచి ఈ పాట ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. బీట్ కి .. స్టెప్స్ కి మంచి మార్కులు పడిపోతున్నాయి.

ఇంతవరకూ ఈ పాట 75 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టింది. ఇంకా అదే ఊపును కొనసాగిస్తుండటం విశేషం. సాధారణంగా కీరవాణి పేరును మెలోడీ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా చెబుతారు. అలాంటి ఆయన మాస్ మనసులు దోచుకునేలా ఇలాంటి ఒక బీట్ చేయడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి.