వెంకీ చేతుల మీదుగా రిలీజ్ అవుతున్న 'లక్ష్య' ట్రైలర్!

29-11-2021 Mon 18:02
  • నాగశౌర్య నుంచి 'లక్ష్య' మూవీ
  • కథానాయికగా కేతిక శర్మ
  • కీలక పాత్రలో జగపతిబాబు
  • వచ్చేనెల 10వ తేదీన సినిమా రిలీజ్  
Lakshya trailer release on December 1st
నాగశౌర్య ఒక వైపున సొంత బ్యానర్లోను .. మరో వైపున ఇతర బ్యానర్లలోను వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటిగా 'లక్ష్య' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విలువిద్య నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. లిరికల్ సాంగ్ కీ అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సిద్ధమవుతున్నారు. వెంకటేశ్ చేతుల మీదుగా డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

వచ్చేనెల 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించనున్నాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సచిన్ కేడ్కర్ కీలకమైన పాత్రల్లో  కనిపించనున్నారు. ఈ సినిమాతోనైనా నాగశౌర్యకి హిట్ పడుతుందేమో చూడాలి.