ఏపీలో గత 24 గంటల్లో 101 కరోనా కేసులు

29-11-2021 Mon 17:54
  • గత 24 గంటల్లో 18,730 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 19 కేసులు
  • విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 2,102 మందికి చికిత్స
AP Corona cases and deaths report
ఏపీలో గడచిన 24 గంటల్లో 18,730 కరోనా నమూనాలు పరీక్షించగా, 101 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 14, గుంటూరు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 138 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,725 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,56,184 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,102 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,439కి పెరిగింది.