డిసెంబరు 3న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ 

29-11-2021 Mon 17:44
  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్'
  • రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ చిత్రం
  • ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి
  • సంబరాలకు వేళయింది అంటూ చిత్రయూనిట్ ట్వీట్
RRR trailer will release December first week
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి ట్రైలర్ వస్తోంది. డిసెంబరు 3న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. అభిమానులందరూ బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. "ఇక మౌనంగా ఉండొద్దు.. సంబరాలకు వేళయింది" అంటూ అభిమానులను ఉత్సాహపరిచింది.

అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.