'పుష్ప' షూటింగులో జాయినైన సమంత!

29-11-2021 Mon 17:33
  • షూటింగు దశలో 'పుష్ప'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • స్పెషల్ సాంగ్ కి సమంత
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల
Pushpa movie update
అల్లు అర్జున్ కథా నాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, సమంత ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ రోజున మొదలైంది. సమంత తదితరులపై ఈ పాటను కొన్ని రోజుల పాటు చిత్రీకరిస్తారట. ఈ సినిమా హైలైట్స్ లో ఈ పాట ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ఉంటుంది.

అలాంటి ఐటమ్ నెంబర్ ఈసారి సమంతపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకు వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రష్మిక కథానాయికగా కనువిందు చేయనున్న ఈ సినిమాలో, ఫాహద్ ఫాజిల్ .. జగపతిబాబు .. సునీల్ .. అనసూయ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.