నేను తగ్గేదే లే... ఎవరూ కూడా తగ్గొద్దు: ఢీ 13 ప్రోమోలో అల్లు అర్జున్ వ్యాఖ్యలు

29-11-2021 Mon 16:34
  • ఢీ-13 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా బన్నీ
  • అదిరిపోయే స్వాగతం
  • గతంలోనూ ఢీ కార్యక్రమానికి వచ్చానన్న బన్నీ
  • పదేళ్ల తర్వాత కూడా పదును తగ్గలేదన్న ప్రదీప్
Allu Arjun attends Dhee grand finale event
డ్యాన్స్ రియాలిటీ షో ఢీ-13 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ తాజాగా విడుదల చేసింది. ఢీ-13 కార్యక్రమానికి ప్రదీప్ హోస్ట్ అని తెలిసిందే. ఇక చీఫ్ గెస్టుగా విచ్చేసిన అల్లు అర్జున్, ప్రదీప్ మధ్య సరదా సంభాషణ జరిగింది.

గతంలోనూ  ఢీ కార్యక్రమానికి విచ్చేశానని, మళ్లీ ఇప్పుడు వస్తున్నానని బన్నీ పేర్కొన్నారు. అందుకు ప్రదీప్ బదులిస్తూ పదేళ్లయినా పదును తగ్గలే అంటూ చమత్కరించారు. గత ఏడు నెలల నుంచి మీరు తగ్గేదే లే అంటున్నారు... దాంతో ఎవరిని కదిలించినా తగ్గేదే లే అంటున్నారు అని ప్రదీప్ సరదాగా వ్యాఖ్యానించారు. దాంతో బన్నీ... ఎవరూ తగ్గొద్దు అంటూ తనదైన శైలిలో రిప్లయ్ ఇచ్చారు. దాంతో హోరు మిన్నంటింది.