గర్ల్‌ఫ్రెండ్‌తో శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్ మెంట్

29-11-2021 Mon 14:16
  • ప్రియురాలు మిథాలీ పరూల్కర్ తో ఎంగేజ్ మెంట్
  • ముంబైలోని శార్ధూల్ ఇంట్లో నిశ్చితార్థం
  • 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత వివాహం జరిగే అవకాశం
Shardul Thakur engagement with his girl friend
టీమిండియా ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఎంగేజ్ మెంట్ జరిగింది. తన ప్రియురాలు మిథాలీ పరూల్కర్ తో పెళ్లి నిశ్చితార్థం జరుపుకున్నాడు. ముంబైలోని శార్ధూల్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

2022లో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. మరోవైపు పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈ జంటకు శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.