డీపీఆర్ లను తెలంగాణ సకాలంలో సమర్పించింది... ఏపీ ఒక్కటి కూడా సమర్పించలేదు: జీవీఎల్

29-11-2021 Mon 14:02
  • ఏపీ సర్కారుపై జీవీఎల్ ధ్వజం
  • ప్రాజెక్టులకు ఆర్నెల్ల లోపు డీపీఆర్ లు పంపాలని వెల్లడి
  • లేకపోతే అనుమతి లభించదని వివరణ
  • తెలంగాణ 12 డీపీఆర్ లు పంపిందని స్పష్టీకరణ
GVL questions CM Jagan on DPRs
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతి లేని నీటి పారుదల ప్రాజెక్టుల డీపీఆర్ లు 6 నెలల్లో పంపాల్సి ఉంటుందని తెలిపారు. లేకపోతే అనుమతి లభించందని వెల్లడించారు.

అయితే, తెలంగాణ 12 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను సకాలంలో సమర్పించిందని, ఏపీ ఒక్కటి కూడా సమర్పించలేదని జీవీఎల్ తెలిపారు. రాజకీయాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా సీఎం జగన్ గారూ అంటూ ట్వీట్ చేశారు.