వ‌ర్ష బీభ‌త్సంపై జ‌గ‌న్‌తో కేంద్ర బృందం స‌మావేశం షురూ

29-11-2021 Mon 12:55
  • ఏపీలో అనేక ప్రాంతాల్లో వ‌ర్షాలు
  • న‌ష్టాన్ని అంచ‌నా వేస్తోన్న కేంద్ర బృందం
  • జ‌గ‌న్‌తో ఆయా అంశాల‌పై చ‌ర్చ‌
union govt officials meet jagan
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు అనేక ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తో కేంద్ర బృందం ఈ రోజు తాడేప‌ల్లిలో స‌మావేశ‌మైంది. భారీ వర్షాలు, వరద నష్టంపై వారు చ‌ర్చిస్తున్నారు.

వరద నష్టం గురించి ఇప్ప‌టికే కేంద్ర బృందం ప‌లు వివ‌రాలు సేక‌రించింది. న‌ష్టాన్ని అంచనా వేసేందుకు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, క‌డ‌ప జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. మ‌రిన్ని అంశాల‌పై కేంద్ర బృందానికి జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇస్తున్నారు.