బ్రోకర్లు, కబ్జాకోర్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతారు: ఈటల రాజేందర్

29-11-2021 Mon 12:41
  • టీఆర్ఎస్ లో భజనపరులకు మాత్రమే చోటు ఉంటుంది
  • పేదలకు కేసీఆర్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదు
  • ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏమిస్తారు?
KCR supports land grabbers and rich people only says Etela Rajender
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ లో కేవలం భజనపరులకు మాత్రమే చోటు ఉంటుందని అన్నారు. ఈరోజు ఆయన పాల్వంచలో పర్యటించారు. పట్టణంలోని తెలంగాణ నగర్ లో ఈటలకు స్థానికులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... తెలంగాణ నగర్ లో నిరుపేదలే ఉంటారని... అందుకే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పేదల పక్షాన కేసీఆర్ ఉండరని... వందల ఎకరాలను ఆక్రమించుకున్నవారు, ధనవంతులు, బ్రోకర్లకు వత్తాసు పలుకుతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు  నిర్మించుకున్నవారికి పట్టాలు ఇవ్వని కేసీఆర్... డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏమిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని జోస్యం చెప్పారు.