నాగార్జున సరసన నాయికగా మెహ్రీన్!

29-11-2021 Mon 12:27
  • నాగ్ హీరోగా 'ది ఘోస్ట్'
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు 
  • ప్రాజెక్టు నుంచి తప్పుకున్న కాజల్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెహ్రీన్  
Mehreen in nagarjuna movie
టాలీవుడ్ లో కొంతకాలంగా సీనియర్ హీరోయిన్ల కొరత ఉంది. చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ వంటి వారు, యువ కథానాయకులతో పోటీపడి మరీ తమ జోరును కొనసాగిస్తున్నారు. వాళ్ల మార్కెట్ .. క్రేజ్ .. స్పీడ్ ఏమీ తగ్గలేదు గానీ, వాళ్ల సరసన కథానాయికను సెట్ చేయడమే కష్టమైపోతోంది.

ఈ నేపథ్యంలో ఇంతవరకూ కాజల్ .. శ్రియలతో కొంతకాలం నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున మూవీ 'ది ఘోస్ట్' నుంచి వ్యక్తిగత కారణాల వలన కాజల్ తప్పుకుంది. దాంతో ఆ పాత్రను రకుల్ తో చేయిద్దామని అనుకున్నారట.

గతంలో ఆమె నాగ్ తో 'మన్మథుడు 2' సినిమా చేసింది గనుక, మెహ్రీన్ ను సంప్రదించారట. కాస్త ఎక్కువ పారితోషికం కావాలని మొదట్లో డిమాండ్ చేసినా, ఆ తరువాత ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె 'ఎఫ్ 3' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.