ధ‌ర్నాకు దిగిన జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు

29-11-2021 Mon 12:14
  • టీడీపీ నేత‌ల‌పై మండిపాటు
  • ఎన్టీఆర్‌పై అనుచిత‌ వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని వ్యాఖ్య‌
  • మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రిక‌
ntr fans agitation in kuppam
టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడి భార్య భువ‌నేశ్వ‌రిపై అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మేన‌త్త‌కు జ‌రిగిన అవ‌మానంపై జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగ్గా లేద‌ని టీడీపీ నేత‌లు వ‌రుస‌గా ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో నిన్న చిత్తూరు జిల్లా కుప్పంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నాకు దిగ‌డం గ‌మ‌నార్హం.  

త‌మ అభిమాన న‌టుడు ఎన్టీఆర్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ  అభిమానులు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన ధ‌ర్నా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారు గ‌తంలోనూ టీడీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు.