'పుష్ప' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

29-11-2021 Mon 11:49
  • సుకుమార్ నుంచి 'పుష్ప'
  • అల్లు అర్జున్ తో మూడో సినిమా
  • డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్ విడుదల
  • 17వ తేదీన సినిమా విడుదల  
Pushpa trailer release on December 6th
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందిస్తున్నాడు. అల్లు అర్జున్ తో ఆయన చేస్తున్న మూడో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
 
డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే కసరత్తు జరుగుతోంది.

రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. సునీల్ .. అనసూయ పాత్రలను పరిచయం చేసిన దగ్గర నుంచి, ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతూ పోతోంది. వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. .