డాలర్ శేషాద్రి మరణంపై చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి ఆవేదన

29-11-2021 Mon 11:18
  • శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అన్న చంద్రబాబు
  • అనునిత్యం స్వామి సేవలో తరించారని వ్యాఖ్య
  • శ్రీవారికి సేవ చేయడమే ఊపిరిగా బతికారన్న వైవీ సుబ్బారెడ్డి
Dollar Sheshadri death is huge loss to TTD says Chandrababu
టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందడం కలచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని అన్నారు. అనునిత్యం వేంకటేశ్వరస్వామి సేవలో తరించిన వ్యక్తి శేషాద్రి అని... టీటీడీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... శేషాద్రి మరణం బాధాకరమని అన్నారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరించిన వ్యక్తి శేషాద్రి అని చెప్పారు. శ్రీవారికి సేవ చేయడమే ఊపిరిగా బతికారని అన్నారు. అర్చకులకు, అధికారులకు పెద్ద దిక్కుగా పని చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.