రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్కోరు 35/1

29-11-2021 Mon 10:20
  • కాన్పూర్ లో టీమిండియా-న్యూజిలాండ్ మధ్య టెస్టు మ్యాచ్
  • ప్ర‌స్తుతం క్రీజులో టామ్ లాథమ్ 12, విలియ‌మ్ సోమర్ విలే
     18
  • విజ‌యానికి 250 ప‌రుగుల దూరంలో న్యూజిలాండ్
 New Zealand need 256 runs
కాన్పూర్ లో టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్‌ బ్యాటింగ్ కొన‌సాగిస్తోంది. విల్ యంగ్ 2 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో టామ్ లాథమ్ 12, విలియ‌మ్ సోమర్ విలే  
18 ప‌రుగులతో ఉన్నారు.

న్యూజిలాండ్ స్కోరు 15 ఓవ‌ర్లకు 34/1 గా ఉంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 234 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగులు చేసింది. విజ‌యానికి న్యూజిలాండ్ 250 ప‌రుగులు చేయాల్సి ఉంది.