దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

29-11-2021 Mon 09:57
  • దేశంలో కొత్త‌గా 8,309 క‌రోనా కేసులు
  • నిన్న 236 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,03,859
  • మొత్తం 4,68,790 మంది మృతి
corona bulletin in inida
దేశంలో కొత్త‌గా 8,309 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. నిన్న 236 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 9,905 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 544 రోజుల క‌నిష్ఠ‌స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 1,03,859 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,40,08,183 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,68,790 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 64,02,91,325 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.