Bihar: అత్యాచారం కేసులో ఒక్క రోజులోనే విచారణ పూర్తి, దోషికి యావజ్జీవం.. దేశంలోనే తొలిసారి

  • జులై 22న 8 ఏళ్ల బాలికపై అత్యాచారం
  • అక్టోబరు 4న కోర్టులో విచారణ
  • అదే రోజు నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించిన న్యాయస్థానం
Bihar Man Gets Life Term in One Days Proceedings in rape case

సాధారణంగా కోర్టు కేసుల్లో విచారణ సంవత్సరాల తరబడి నడుస్తుంది. క్రిమినల్ కేసుల్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో కేసులు విచారణలో ఉండగానే నిందితులో, బాధితులో మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే, దేశంలోనే తొలిసారిగా బీహార్‌లోని పోక్సో కోర్టు ఒక్క రోజులోనే కేసును విచారించి సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని అరారియా జిల్లాకు చెందిన వ్యక్తి జులై 22న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆ తర్వాతి రోజు కేసు నమోదైంది.

అక్టోబరు 4న కేసు విచారణకు రాగా అదే రోజు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అంతేకాదు, బాధితురాలికి రూ. 7 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ తాజాగా వెలుగు చూసింది. ఒక్క రోజులోనే కేసు విచారణ పూర్తై తీర్పు వెలువడడం దేశంలోనే ఇది తొలిసారని బీహార్ హోంశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తెలిపింది.

More Telugu News