తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు వివరాలు ఇవిగో!

28-11-2021 Sun 22:06
  • గత 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు
  • 135 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,535 మందికి చికిత్స
Telangana corona daily media bulletin
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు నిర్వహించగా, 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు గుర్తించారు. అదే సమయంలో 144 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,090 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,535 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,989కి పెరిగింది.