ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా బాటలో జియో... ప్రీపెయిడ్ చార్జీలు పెంపు

28-11-2021 Sun 20:07
  • 20 శాతం మేర రేట్లు పెంచిన జియో
  • డిసెంబరు 1న నుంచి కొత్త టారిఫ్
  • ఈ నెల 22న ధరలు పెంచుతూ ఎయిర్ టెల్ నిర్ణయం
  • 25 శాతం రేట్లు పెంచిన ఎయిర్ టెల్
JIO hikes prepaid rates after Airtel and Vodafone Idea
దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ప్రీపెయిడ్ రేట్లు పెంచుతున్నారు. ఇప్పటికే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ప్రీపెయిడ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు రిలయన్స్ జియో కూడా ప్రీపెయిడ్ ధరలు పెంచింది. ప్రీపెయిడ్ ప్లాన్లపై 20 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు జియో నేడు ఒక ప్రకటనలో తెలిపింది. పెంచిన ప్రీపెయిడ్ టారిఫ్ డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అదే సమయంలో కొత్త అన్ లిమిటెడ్ ప్లాన్లు కూడా ప్రవేశపెడుతున్నట్టు జియో వెల్లడించింది.

కాగా, వారం వ్యవధిలోనే ఈ మూడు టెలికాం సంస్థలు ధరలు పెంచాయి. తొలుత ఈ నెల 22న ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ చార్జీలను 25 శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించగా, వొడాఫోన్ ఐడియా సైతం పెంపు నిర్ణయం తీసుకుంది.