చంపేస్తామంటూ గంభీర్ కు మరోసారి బెదిరింపులు.. వారంలో ఇది మూడోసారి!

28-11-2021 Sun 15:52
  • ఇటీవల గంభీర్ కు బెదిరింపులు
  • ఐసిస్ కశ్మీర్ పేరిట హెచ్చరికలు
  • గంభీర్ కు వ్యక్తిగత భద్రత పెంచిన పోలీసులు
  • గంభీర్ ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
Third death threat to Gautham Gambhir
భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. గంభీర్ ను చంపేస్తామంటూ ఐసిస్ కశ్మీర్ మరోసారి హెచ్చరించింది. గడచిన వారం రోజుల్లో గంభీర్ కు ఈ విధమైన బెదిరింపులు రావడం మూడోసారి అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఓ ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు.

"మీ ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్ అధికారిణి శ్వేత (డీసీపీ) ఏం పీకలేరు. పోలీసు విభాగంలో మా గూఢచారులు ఉన్నారు. మీ గురించి మాకు మొత్తం సమాచారం అందుతుంది" అంటూ ఐసిస్ కశ్మీర్ పేరిట గంభీర్ కు ఈమెయిల్ పంపారని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

బెదిరింపుల నేపథ్యంలో గంభీర్ కు వ్యక్తిగత భద్రత పెంచారు. అంతేకాదు, ఢిల్లీలోని రాజిందర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.