నేపాలీ బాలికను దత్తత తీసుకున్న బండ్ల గణేశ్

28-11-2021 Sun 14:15
  • బండ్ల గణేశ్ మానవీయత
  • పేద కుటుంబం నుంచి బాలిక దత్తత
  • పాప తమ ఇంట్లో ఒకరిగా మారిపోయిందని సంతోషం
  • ప్రయోజకురాలిని చేస్తానని వెల్లడి
Bandla Ganesh adopts Nepalese girl child
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. పేద కుటుంబానికి చెందిన ఓ నేపాలీ బాలికను దత్తత స్వీకరించారు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న కుటుంబం నుంచి ఆ పాపను దత్తత తీసుకున్నట్టు బండ్ల గణేశ్ వెల్లడించారు.

పాప ఏడుస్తుంటే ఆమె తల్లి ఏమీ లేకపోవడంతో కేవలం పాలు పడుతున్న పరిస్థితిని తన భార్య గమనించిందని, భార్య సూచన మేరకు ఆ పాపను తమ ఇంటికి తీసుకువచ్చామని వివరించారు. ఇప్పుడా పాప తమ ఇంట్లో ఒకరిగా మారిపోయిందని, ఏకంగా తమనే బెదిరిస్తోందని సరదాగా చెప్పారు. ఆ నేపాలీ అమ్మాయిని ఉన్నత చదువులు చదివించి, ప్రయోజకురాలిని చేయాలనుకుంటున్నానని బండ్ల గణేశ్ తెలిపారు.

చాలా మంది కుక్కలు, పిల్లులను పెంచుకుంటూ ఎంతో ఖర్చు చేస్తుంటారని, తాను ఓ పాపకు జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.