రోగికి చికిత్స చేస్తుండ‌గా వైద్యుడికి గుండెపోటు.. ఇద్ద‌రూ మృతి

28-11-2021 Sun 13:23
  • కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌
  • గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తికి గుండెనొప్పి
  • ఆసుప‌త్రికి వెళ్లిన బాధితుడు
  • అత‌డికి వైద్యం చేస్తుండ‌గా ఘ‌ట‌న‌
patient and doctor die of heart attack
గుండెపోటుకు గురైన ఓ వ్య‌క్తి ఆసుప‌త్రికి వెళ్లాడు. అయితే, అత‌డికి చికిత్స చేస్తోన్న స‌మ‌యంలో వైద్యుడికీ గుండెపోటు రావ‌డంతో రోగితో పాటు ఆయ‌న కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్‌ తండాలో చోటు చేసుకుంది.

గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తి గుండెనొప్పితో ఆసుప‌త్రికి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అతడికి చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యుడి పేరు లక్ష్మణ్ అని పోలీసులు తెలిపారు. గుండెపోటుకు గురైన వైద్యుడు లక్ష్మణ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, పేషెంట్‌ను కామారెడ్డి ఆసుప‌త్రికి తీసుకెళ్తోన్న స‌మ‌యంలో మృతి చెందాడు.