నెల్లూరు వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకుంటోన్న‌ సోనూసూద్

28-11-2021 Sun 12:11
  • సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ తరఫున సాయం
  • బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలు తీర్చేందుకు కృషి
  • బాధితుల‌కు నిత్యవసరాల‌తో కూడిన కిట్లు
sonu sood helps nellore people
ఏపీలోని నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తూ సినీ నటుడు సొనూసూద్ మరోసారి ఉదారతను చాటుకుంటున్నారు. వరద బాధితులను ఆదుకోవ‌డం కోసం సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ తరఫున  బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నారు.

బాధితుల‌కు బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు వంటి నిత్యవసరాల‌తో కూడిన కిట్ల‌ను పంపారు. నేటి నుంచి బాధిత కుటుంబాలకు ఈ కిట్లను పంచుతారు. అందుకోసం వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.