అందుకే కేసీఆర్‌లో అసహనం పెరిగింది: ఈట‌ల వ్యాఖ్య‌లు

28-11-2021 Sun 10:30
  • హుజూరాబాద్ ఉప‌ ఎన్నికలో ఓడిపోయారు
  • ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నారు
  • టీఆర్ఎస్‌ రాజకీయాలు చేయ‌డం మానేయాలి
etela fires on kcr
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్‌ ఉప‌ ఎన్నికలో ఓడిపోయిన నేప‌థ్యంలో కేసీఆర్‌లో అసహనం పెరిగింద‌ని అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. కేంద్ర స‌ర్కారు ఏడేళ్ల నుంచి రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంద‌ని వివ‌రించారు.

అంతేగాక‌, రైతులు పండించిన ధాన్యంపై  పెట్టుబడి అంతా కేంద్ర ప్ర‌భుత్వ‌మే పెడుతోందని ఆయ‌న అన్నారు. ఇప్పుడు రాష్ట్ర స‌ర్కారు ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. టీఆర్ఎస్‌ రాజకీయాలు చేయ‌డం మానేసి ధాన్యం కొనుగోలు చేయాలని  ఆయ‌న అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి, మ‌రి ధాన్యాన్ని కేసీఆర్ ఎందుకు కొనుగోలు చేయట్లేదని ఆయ‌న నిల‌దీశారు.