543 రోజుల క‌నిష్ఠానికి చేరిన క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌

28-11-2021 Sun 10:13
  • దేశంలో కొత్త‌గా 8,774 క‌రోనా కేసులు
  • నిన్న‌ 621 మంది మృతి
  • యాక్టివ్ కేసులు 1,05,691
  • మొత్తం కేసుల సంఖ్య‌ 3,45,72,523
corona bulletin in inida
దేశంలో కొత్త‌గా 8,774 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 621 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. 9,481 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,05,691 మంది చికిత్స తీసుకుంటున్నారు.

యాక్టివ్ కేసుల సంఖ్య‌ 543 రోజుల క‌నిష్ఠానికి చేరింది. మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 3,45,72,523కి పెరిగింది. కోలుకున్న వారి సంఖ్య‌ 3,39,98,278గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య‌ 4,68,554కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 63,93,39,125 క‌రోనా టెస్టులు చేశారు.