పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం
- మృతదేహాలతో శ్మశానానికి వెళ్తుండగా ఘటన
- తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు
- దట్టంగా కురుస్తున్న మంచు, అతి వేగమే ప్రమాదానికి కారణం
హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్కును మెటాడోర్ అత్యంత బలంగా ఢీకొంది. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు దట్టంగా కురుస్తున్న మంచే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.