టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల తండ్రి కన్నుమూత

28-11-2021 Sun 08:14
  • గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైట్ల కృష్ణారావు
  • ఈ తెల్లవారుజామున మృతి
  • శ్రీను వైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
Tollywood Director Srinu Vaitla Father krishna rao died
తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.