పలాసలో 108 అంబులెన్సును ఢీకొట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన రైలు

28-11-2021 Sun 06:32
  • రోగిని తీసుకెళ్లేందుకు ప్లాట్‌ఫామ్ పైకి వచ్చిన 108 వాహనం
  • అంబులెన్స్ డ్రైవర్, వైద్య నిపుణుడు సురక్షితం
  • ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వాహనం
Train collide to 108 ambulance on palasa railway platform
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు ప్లాట్‌ఫామ్ పైకి వెళ్తున్న అంబులెన్సును రైలు ఢీకొట్టి 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఈ ఘటనతో భయపడి పరుగులు తీశారు. ప్రమాదంలో అంబులెన్స్ నుజ్జునుజ్జు అయింది. అంబులెన్స్ డ్రైవర్, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.