బాలయ్య బాబు ఒక ఆటం బాంబు: రాజమౌళి

27-11-2021 Sat 21:53
  • హైదరాబాదులో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • చిత్రంలోని ఓ పాటను ఆవిష్కరించిన రాజమౌళి
  • బాలయ్యను ఎలా ఉపయోగించాలో బోయపాటికి తెలుసని వెల్లడి
  • తాను కూడా మొదటి రోజే సినిమా చూస్తానని స్పష్టీకరణ
Rajamouli terms Balakrishna an atom bomb
అఖండ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన దర్శకుడు రాజమౌళి చిత్రంలోని ఓ పాటను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బాలకృష్ణ ఓ ఆటం బాంబు లాంటివాడని, అలాంటి బాంబును సరిగ్గా ఉపయోగించగలిగిన వ్యక్తి బోయపాటి శ్రీను ఒక్కడేనని అన్నారు. ఆ రహస్యం ఏంటో తమకు కూడా చెప్పాలని రాజమౌళి చమత్కరించారు. డిసెంబరు 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొత్త జోష్ వస్తుందని, అందుకు కారణం బాలయ్య సినిమా విడుదల అవుతుండడమేనని పేర్కొన్నారు.

తాను కూడా అఖండ చిత్రాన్ని మొదటి రోజే థియేటర్లో చూస్తానని చెప్పారు. అఖండలో బాలయ్య ఎంట్రీ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, తద్వారా ఇండస్ట్రీకి మరింత ఉత్సాహం కలిగించాలని రాజమౌళి అభిలషించారు.