తెలంగాణలో కొత్తగా 160 కరోనా కేసులు

27-11-2021 Sat 21:43
  • గత 24 గంటల్లో 32,540 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,545 మందికి చికిత్స
Telangana corona media bulletin
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 32,540 కరోనా పరీక్షలు నిర్వహించగా, 160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 66 కొత్త కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 21, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 148 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,75,479 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,946 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,545 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,988కి పెరిగింది.