"సిరీ వదిలేస్తున్నావా"... బిగ్ బాస్ వేదికపై బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్

27-11-2021 Sat 19:50
  • రసవత్తరంగా బిగ్ బాస్-5 తెలుగు సీజన్
  • స్టార్ మాలో ప్రసారం
  • తాజాగా ప్రోమో రిలీజ్
  • కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితుల సందడి
Siri boyfriend Srihan entered onto BigBoss stage
బిగ్ బాస్ ఇంట్లోకి ఈ వారం కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు రావడం తెలిసిందే. దాంతో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో తీవ్రస్థాయిలో భావోద్వేగాలు పండాయి. అయితే, బిగ్ బాస్ నిర్వాహకులు అంతటితో సరిపెట్టడంలేదు. కంటెస్టెంట్ల ఇతర కుటుంబసభ్యులను, సన్నిహితులను కూడా తీసుకువచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను 'స్టార్ మా' చానల్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున కూడా విచ్చేశారు.

ప్రోమోలో మొదట యాంకర్ రవి తల్లిని చూపించారు. నువ్వు బిగ్ బాస్ ఇంటికే రాజా అంటూ ఆమె తనయుడ్ని ప్రోత్సహించడం ప్రోమోలో చూడొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా బిగ్ బాస్ వేదికపైకి వచ్చాడు. శ్రీహాన్ ను చూడగానే తీవ్ర భావోద్వేగాలకు లోనైన సిరి పెద్దగా ఏడ్చింది. చేతుల్లో ముఖం దాచుకుని విలపించింది. ఇంతలో శ్రీహాన్ మాట్లాడుతూ.... "సిరీ.. వదిలేస్తున్నావా?" అనడంతో సిరి ఇంకా ఎమోషన్స్ కు గురైంది. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసుకోవాలంటే నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే.