బాలకృష్ణ 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం

27-11-2021 Sat 19:32
  • బాలయ్య, బోయపాటి కాంబోలో అఖండ
  • అఘోరాగా కనిపించనున్న బాలకృష్ణ
  • శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, రాజమౌళి
  • డిసెంబరు 2న విడుదల కానున్న అఖండ
Akhanda pre release event begins
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అఖండ'. ఈ భారీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభంమైంది. కాగా, 'అఖండ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా వస్తున్నారు.

ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖండ' డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ సంగీతం అందించాడు.