రాజమౌళి వర్కింగ్ స్టయిల్ కు అజయ్ దేవగణ్ ఫిదా

27-11-2021 Sat 16:04
  • రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్'
  • కీలక పాత్రలో అజయ్ దేవగణ్
  • రాజమౌళి ఆలోచనా విధానం చాలా బాగుంటుదని వెల్లడి
  • సినిమాను ఓ వేడుకలా తెరకెక్కిస్తారని కితాబు
Ajay Devgan praises Rajamouli working style
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై దేశవ్యాప్తంగా హైప్ నెలకొంది. ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. కాగా, అజయ్ దేవగణ్ కు ఇదే తొలి దక్షిణాది చిత్రం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు. రాజమౌళితో సినిమా అంటే ఒక ఉత్సవంలా ఉంటుందని, ఆయన సినిమాను తెరకెక్కించే విధానం ఒక సంబరంలా అనిపించిందని అన్నారు.

"రాజమౌళితో చిత్రం అనగానే నేను కొన్ని పరిస్థితులను ఊహించుకున్నాను. సరిగ్గా నేను ఊహించినట్టే జరిగింది. రాజమౌళితో సెట్స్ పై గొప్పగా గడిచింది. ఆయన పనితీరు, ఆలోచనా విధానం నన్ను ముగ్ధుడ్ని చేసింది" అని అజయ్ దేవగణ్ వెల్లడించారు.

 ఇటీవల అజయ్ దేవగణ్ సినీ పరిశ్రమంలో 30 ఏళ్లు పూర్తి చేసుకోగా, రాజమౌళి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.