తను ఎంతో మందికి సాయం చేసినా ఎవరికీ చెప్పలేదు: రాజమౌళి

27-11-2021 Sat 12:55
  • పునీత్‌ రాజ్‌కుమార్ మ‌ర‌ణం త‌ర్వాతే అంద‌రికీ ఆయ‌న సేవ‌లు తెలిశాయి
  • సాధారణంగా ఎవ‌రైనా  చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలియ‌జేస్తారు
  • పునీత్ రాజ్‌కుమార్ మాత్రం అలా కాదు
rajamouli punith death
సినీన‌టుడు పునీత్‌ రాజ్‌కుమార్ చాలా మందికి సాయం చేసిన‌ప్ప‌టికీ ఎవ్వ‌రికీ చెప్ప‌లేద‌ని, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాతే ఆయ‌న సేవ‌ల గురించి అంద‌రికీ తెలిసింద‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అన్నారు. తాజాగా ఆయ‌న పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై స్పందిస్తూ.. త‌నకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు.  

సాధారణంగా ఎవ‌రైనా చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలిసేలా ప్ర‌చారం చేసుకుంటార‌ని, పునీత్ రాజ్‌కుమార్ మాత్రం అలా కాదని ఆయ‌న అన్నారు.  నాలుగు ఏళ్ల క్రితం తాను బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్ రాజ్‌కుమార్‌ను కలిశానని. త‌న‌ను  కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని చెప్పారు. త‌న‌తో ఆయ‌న‌ సరదాగా మాట్లాడారని, ఒక స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావనే త‌నకు కలగలేదని రాజ‌మౌళి అన్నారు.