'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్టుగా రాజమౌళి!

27-11-2021 Sat 12:05
  • బాలకృష్ణ నుంచి 'అఖండ'
  • బోయపాటితో మూడో సినిమా
  • విలన్ పాత్రలో శ్రీకాంత్
  • డిసెంబర్ 2వ తేదీన విడుదల  
Akhanda movie update
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'అఖండ' సినిమాను, డిసెంబర్ 2వ  తేదీన భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా కోసం, బాలయ్య అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

ఈ రోజున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ను ఆహ్వానించారు. ఇక స్పెషల్ గెస్టుగా రాజమౌళి రానున్నారు. ఈ విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడిస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో, అందరిలో అంచనాలు ఉన్నాయి. ఇక రాజమౌళి - అల్లు అర్జున్ అతిథిలుగా వస్తుండటంతో అందరి దృష్టి కూడా ఇప్పుడు ఈ ఫంక్షన్ పైనే ఉంది. శ్రీకాంత్ విలన్ గా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను చేసిన సంగతి తెలిసిందే..