Madhuri Dixit: మాధురి దీక్షిత్ నుంచి సానియా మీర్జా వరకు ఇప్పుడు ఇదే ట్రెండ్.. ఈ ఐఫోన్ ట్రెండ్‌ను మీరు ట్రై చేశారా?!

Madhuri Dixit To Sania Mirza Everyone now Joining This iPhone Trend
  • ఐఫోన్ లాక్‌స్క్రీన్ ట్రెండ్ వెనక సెలబ్రిటీల పరుగులు
  • మిలియన్ల కొద్దీ వ్యూస్
  • ఇన్‌స్టాగ్రామ్‌ను హోరెత్తిస్తున్న సెలబ్రిటీలు
  • తెగ చూసేస్తున్న అభిమానులు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడో కొత్త ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. దానిపేరే ‘‘ఐఫోన్ లాక్‌స్క్రీన్’’ ట్రెండ్. సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు దీని వెనకే పరుగులు తీస్తున్నారు. బాలీవుడ్  నటులు మాధురీ దీక్షిత్, గౌమర్ ఖాన్, కరిష్మా తన్నా నుంచి హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వరకు అందరూ ఇప్పుడు ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. ఈ వీడియోలను తమ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వీటికి లక్షల్లో లైకులు వస్తున్నాయి.

ఈ నయా ట్రెండ్ కోసం చేయాల్సిందల్లా.. ఫోన్ కెమెరా ముందు కొన్ని సెకన్లపాటు బొమ్మలా కదలకుండా ఉండడమే. వెనక సిగ్నేచర్ ట్యూన్ ‘బన్నా రే’’ సాంగ్ ప్లే అవుతుంది. పాట బీట్ మొదలైనప్పుడు కళ్లను కదిలిస్తే సరి. ఇప్పుడీ లాక్‌స్క్రీన్ చాలెంజ్ వైరల్ కావడంతో సెలబ్రిటీలందరూ దీని వెనకపడుతున్నారు.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ లాక్‌స్క్రీన్‌ను తన కారులో ట్రై చేసింది. ఓ ప్రో లాగా బీట్ అయిపోయే వరకు అలాగే నిశ్చలంగా ఉండిపోయింది. ఆ తర్వాత అలసిన రెప్పలను కదిలించింది. బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ కూడా దీనిని ట్రై చేసింది. కళ్లను నిశ్చలంగా ఉంచి ఆపై కళ్లు కొట్టి కుర్చీలో గిరిగిరా తిరిగింది. దీనికి ‘రియల్ టు రీల్’ అని క్యాప్షన్ తగిలించింది.

ఈ వీడియో 49.5 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకోవడం విశేషం. అలాగే, నటి మున్‌మున్ దత్తా, కర్మిష్మా తన్నా సహా సెలబ్రిటీలందరూ ఇప్పుడు ఈ ‘ఐఫోన్ లాక్‌స్క్రీన్’  ట్రెండ్ వెనక పడడంతో అభిమానులు కూడా దానినే అనుసరిస్తూ  ఇన్‌స్టాగ్రామ్‌ను హోరెత్తిస్తున్నారు.
Madhuri Dixit
Sania Mirza
iPhone Trend
iPhone Lock Screen
Bollywood

More Telugu News