రిలీజ్ కి రెడీ అవుతున్న 'మరక్కార్'

27-11-2021 Sat 11:38
  • మోహన్ లాల్ నుంచి 'మరక్కార్'
  • చారిత్రక నేపథ్యంతో కూడిన కథ 
  • కథానాయికగా కీర్తి సురేశ్
  • డిసెంబర్ 2వ తేదీన విడుదల  
Marakkar movie update
మోహన్ లాల్ ఇప్పటికీ కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన తాజా చిత్రంగా 'మరక్కార్' రూపొందింది. అరేబియా సముద్ర తీర ప్రాంతానికి చెందిన ఒక వీరుడి కథ ఇది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.

బలమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాను, ఆశీర్వాద్ సినిమాస్ వారు అత్యధిక బడ్జెట్ తో నిర్మించారు. లుక్ పరంగా మోహన్ లాల్ మంచి మార్కులను కొట్టేశారు. మలయాళంతో పాటు తెలుగులోను .. ఇతర భాషల్లోను ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అర్జున్ .. సునీల్ శెట్టి .. ప్రభు .. కల్యాణి ప్రియదర్శన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇంతవరకూ వదులైన ప్రచార చిత్రాల కారణంగా, మలయాళంతో పాటు తెలుగులోను ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.