'అఖండ'లో నా పాత్ర చాలా పవర్ఫుల్: ప్రగ్యా జైస్వాల్

27-11-2021 Sat 10:55
  • ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాను
  • నా పాత్రను గొప్పగా డిజైన్ చేశారు
  • బాలయ్యతో చేయడానికి భయపడ్డాను
  • తప్పకుండా హిట్ అవుతుందన్న ప్రగ్యా      
Akhanda movie update
బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' సినిమా రూపొందింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, బోయపాటి దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ అలరించనుంది.

వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది .. ఐఏఎస్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్రను బోయపాటిగారు చాలా గొప్పగా డిజైన్ చేశారు.

ఇక బాలకృష్ణగారితో కలిసి నటించాలంటే భయం వేసింది. కానీ నేను కంఫర్టుగా ఉండేలా ఆయన చూడటంతో చేయగలిగాను. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది .. నా పాత్రకి మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.