కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

27-11-2021 Sat 10:47
  • కరోనా బారిన పడిన కమలహాసన్
  • చెన్నైలో శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స
  • కమల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
Kamal Haasan health Bulletin
విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కమల్ కు దగ్గు రావడం ప్రారంభమైంది. దీంతో వైద్యుల సలహా మేరకు కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు.

కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. కమలహాసన్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరారని బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తాజా బులెటిన్ లో వివరాలను చూసి ఆయన అభిమానులు ఊరట చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని ఆకాంక్షిస్తున్నారు.