Omicron: ద‌క్షిణాఫ్రికాను కుదిపేస్తున్న ఒమిక్రాన్‌… మ‌ళ్లీ ఆంక్ష‌లు మొద‌లు!

  • రూపం మార్చుకున్న కరోనా వైరస్
  • పలు దేశాల్లో వేరియంట్ గుర్తింపు
  • ఇండియాలో ఇప్పటి వరకు నమోదు కాని ఈ వేరియంట్ కేసు
Omicron new Corona variant in South Africa

తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. తాజాగా రూపం మార్చుకుని జనాలపై దాడికి సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాలో బీ 1.1.529 కరోనా వేరియంట్ ను గుర్తించారు. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు 'ఒమిక్రాన్'గా పేరు పెట్టారు. దీన్ని ప్రమాదకరమైన వేరియంట్ గా వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిఉంటుంది. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్ వానా దేశాల్లో ఈ వేరియంట్ కనిపించింది. తాజాగా బెల్జియం, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వేరియంట్ ను గుర్తించిన దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి.

ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, సింగపూర్, ఇజ్రాయెల్ దేశాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మన దేశంలో ఈ రకం వేరియంట్ కేసులు ఇంకా నమోదు కాలేదు. అయితే, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

More Telugu News